పవన్ సినిమాలో రానా.. ఇట్స్ అఫీషియల్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలలో భాగంగా ఆయన ఒక మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కొషియం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కీలక రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా రానా దగ్గుబాటి తీసుకుంటారు అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆ ప్రచారానికి సినిమా యూనిట్ బ్రేకులు వేస్తూ సినిమా టీమ్ లోకి రానా దగ్గుబాటిని ఆహ్వానిస్తున్నాము అంటూ ఒక ప్రకటన చేసింది.

ఈ రోజు ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు, అలాగే జనవరి 2నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో రానా అయితే బాగుంటుందని భావించిన సినిమా యూనిట్ ఆ క్యారెక్టర్ కోసం సంపాదించడంతో ఆయన వెంటనే ఒప్పుకున్నాడని సమాచారం. ఇక మలయాళంలో బిజు మీనన్ నటించిన పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర లో పవన్ నటించనున్నాడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version