బూతులతో రెచ్చిపోయిన ఫోటోగ్రాఫర్.. సీరియస్ అయిన రన్బీర్ కపూర్

-

మాములుగా సినీ సెలబ్రిటీస్ ఎక్కడ ఉంటే మీడియా, రిపోర్టర్స్, ఫొటోగ్రాఫర్స్ అక్కడ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు చేసే హడావిడికి సెలబ్రిటీస్ సహనం కోల్పోయి అరిచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.కానీ, బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ విషయంలో మాత్రం అది రివర్స్ అయ్యింది.

రణ్బీర్ కపూర్ తాజాగా ఓ జెవెలరీ షాప్ ఓపెనింగ్ కోసం సూరత్ ప్రాంతానికి వెళ్ళాడు. రణ్బీర్ వస్తున్న విషయం తెలియడంతో చాలా మంది అభిమానులతో పాటు మీడియా కూడా అక్కడికి చేరుకుంది. అందులో ఓ ఫోటోగ్రాఫర్ రణ్బీర్ ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేశాడు. కారణం ఏంటో తెలియదు కానీ, ఆ ఫోటోగ్రాఫర్ రణ్బీర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ మాటలు రణ్బీర్ కు వినబడటంతో ఒక్కసారిగా నిర్గాంత పోయాడు.ఆ ఫోటోగ్రాఫర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ.. ఇక్కడ ఏం జరుగుతుంది.. అంటూ సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లా వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version