ఆస్కార్ కాదు జగన్ కి భాస్కర్ ఇవ్వాలి: నారా లోకేష్

-

ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయి ఎన్నికల దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు కూడా ప్రచారంతో దూసుకు వెళ్ళిపోతున్నాయి. మాటలు యుద్ధం కూడా ఎక్కువగా చూస్తున్నాం మంగళగిరి మండలం నీరుకొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా లోకేష్ మాట్లాడుతూ అట్టర్ ఫ్లాప్ డ్రామాలు, చెత్త నటనకి అవార్డులు ఉన్నట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మొత్తం అవార్డులు వస్తాయని నారా లోకేష్ అన్నారు.

వరుసగా మూడు డ్రామాలు ఫెయిల్ అయినా మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు అని అన్నారు అధికారంలోకి రాగానే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు చేస్తామని నారా లోకేష్ అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ రాజధాని లో పేదలకి 5000 రూపాయల పెన్షన్ ని కొనసాగిస్తామన్నారు. అసైన్డ్ రైతులకి ఇవ్వాల్సిన కౌలు ని వడ్డీతో చెల్లిస్తామని అన్నారు గులకరాయతో దాడి ఘటనలో జగన్ కి ఆస్కార్ కి బదులుగా భాస్కర్ అవార్డు ఇవ్వాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version