Vaishnav Tej : “రంగ రంగ వైభవంగా” అంటూ వచ్చేసిన వైష్ణవ్‌ తేజ్‌

-

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైష్ణవ్‌.. బుచ్చి బాబు దర్శకత్వలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఉప్పెన తర్వాత ఆయన తాజాగా నటించిన సినిమా కొండ పొలం. ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.

కానీ ఓటీటీతో పాటు తాజాగా వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌ లో ఈ సినిమాకు మంచి రేటింగ్స్‌ వచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత వైష్ణవ్‌ గిరీషయ్య అనే దర్శకుడు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌ సరసన కేతిక శర్మ హీరోయిన్‌ గా నటిస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ ను విడుదల చేసింది చిత్రబృందం.”రంగ రంగ వైభవంగా” అనే టైటిల్‌ ను చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. ఇక ఇందులో హీరోయిన్‌, హీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ టచ్‌ బాగా వర్కౌట్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version