సంక్రాంతి అంటే సినిమాల పండుగ కూడా..టెంటుల కింద పందెం కోళ్లు తలపడితే బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలు తలపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ యేడాది బాక్స్ ఆఫీస్ వద్ద సందడి లేకుండా పోయింది. స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ సినిమాలు సంక్రాంతినే టార్గెట్ చేసుకున్నాయి. రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించారు. కానీ ఒమిక్రాన్ కారణంగా ఈ సినిమాలు వాయిదా పడ్డాయి.
అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలను కూడా ఎప్రిల్ లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అంతే కాకుండా మెగాస్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా కూడా ఎప్రిల్ లో విడుదల చేయాలనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలతో పాటూ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను కూడా ఎప్రిల్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించిందట.
కానీ అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉంది. మహేశ్ బాబు రీసెంట్ గా కరోనా నుండి కోలుకున్నారు. అంతకుముందే ఆయన కాలికి సర్జరి జరిగింది. ఈ సమస్యలతో పాటూ మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు రీసెంట్ మరణించాడు. దాంతో మహేశ్ బాబు ఇప్పుడే షూటింగ్ లకు వెళతారా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
కాబట్టి ఎప్రిల్ బరిలో సర్కారు వారి పాట నిలిచే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను కూడా ఎప్రిల్ లోనే విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దాంతో ఎప్రిల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.