13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికకు చేవెళ్ల మండలం కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్(40)తో మే 28న బాల్య వివాహం జరిగింది.

బాలికకు అత్తగారింటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతో ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయులు తహసీల్దార్ రాజేశ్వర్, ఇన్స్పెక్టర్ ప్రసాద్‌లకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు అధికారులు. బాలికకు వివాహం చేసిన తల్లి స్రవంతితో పాటు వరుడు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, సంబంధం చూసిన వ్యక్తి పెంటయ్యపై కేసు నమోదు అయింది. బాలికను సఖి సెంటర్‌కు తరలించారు.