తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గులాబీ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో… సమావేశం అయ్యారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావులతో సమావేశమయ్యారు కేసీఆర్. ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల… కేసు పై సుప్రీంకోర్టు కీలక తీర్పు… ఇవ్వడం జరిగింది.

మూడు నెలల్లోనే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల పైన… ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇలాంటి నేపథ్యంలోనే కెసిఆర్ అధ్యక్షతన ముగ్గురు బడా లీడర్లతో ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతోంది.