మాయ మాటల చెప్పి విద్యార్థినులను లోబరుచుకుంటున్న కొందరు కామాంధులను చూస్తూనే ఉన్నాం.. అమాయకపు మాటలు చెప్పి బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజగా ఇలాంటి సంఘటనే కేరళలో జరిగింది. మాయ మాటలు చెప్పి పదో తరగతి బాలికను లోబరుచుకుని గర్భినిని చేశాడు.
వివరాల్లోకి వెళితే.. కోెచింగ్ క్లాసులకు వచ్చే పదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడోె ఉపాధ్యాయుడు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కేరళలోని ఎరోడ్ జిల్లాకు చెందిన బాధితురాలు కోచింగ్ నిమిత్తం సదరు ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లేది. ఈ క్రమంలో మాయమాటలు చెప్పి నిందితుడు.. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని నెలల క్రితం బాలిక గర్భం దాల్చగా ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.