ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దారుణాలు ఎక్కువ అవుతున్నాయి తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. మొన్నటికి మొన్న హత్రాస్ లో దళిత యువతిపై దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరవకముందే మరిన్ని దారుణ ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక దాడులు కూడా పెరుగుతున్నాయి. ఇక ఇటీవలే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలిక అత్యాచారానికి గురయింది.
ట్యూషన్ కి వెళ్తే పాపం జరిగిపోయింది. శాండిల్ ప్రాంతానికి చెందిన బాలిక ఓ వ్యక్తి ఇంటికి తరచూ ట్యూషన్ వెళుతూ ఉండేది. టీచర్ సోదరుడు సదరు బాలిక పై కన్నేశాడు. ఎవరికీ తెలియకుండా బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఐదేళ్ల బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో షాకైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా కలకలం సృష్టించింది ఈ ఘటన.