అసలు జగన్ కు చంద్రబాబుకు పోలికే లేదు: టీడీపీ రెబల్ ఎమ్మెల్యే

-

జగనన్న విద్యా కానుక కు మద్దతుగా, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీలో నగర అధ్యక్షుడు గా నాలుగు సార్లు పనిచేశాను అని గుర్తు చేసుకున్నారు. పార్టీ మారగానే సముద్రమంత మార్పు కనిపించిందని ఆయన అన్నారు. నేను ప్రతిపక్షంలోనూ , రూలింగ్ లో పనిచేశాను అని అన్నారు.

ప్రతిపక్ష నాయకుడి కి , సిఎం జగన్ కు అసలు పోలికే లేదు ఆయన అన్నారు. ధనికుల కోసమే కోసమే అన్నట్లు ఆ పార్టీ పనిచేసింది అని ఆయన మండిపడ్డారు. ఈ పార్టీ పేదల కోసం మధ్యతరగతి కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. నా ఊపిరి ద్వారా ఈ జండా ఎగరాలని కోరుకుంటున్నానని ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version