సాధారణంగా మగవాళ్ళు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు కానీ తాజాగా ఓ మహిళ 17 ఏళ్ల బాలుడిని ఇంటికి పిలిచి అఘాయిత్యం ఇక పాల్పడింది అంతేకాకుండా అతనిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసి చివరకు దొరికిపోయింది ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో ఉండే పదిహేడేళ్ల బాలుడిని అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ ఇంటికి పిలిచి అగాయిత్యానికి పాల్పడింది.
ఆ తరవాత అతడిని సూరత్ కు తీసుకువెళ్ళింది. బాలుడు కనిపించకపోవడం తో అతడి తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెతకడం ప్రారంభించగా సూరత్ లో మహిళ వద్ద బాలుడు ఉన్నట్టు గుర్తించారు. బాలుడిని తల్లి తండ్రులకు అప్పగించారు. మహిళపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.