భారత్ ఎంతగానో ఎదురుచూస్తోన్న రఫేల్ యుద్ధవిమానాలు అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. తొలుత భారత్ గగనతలంలోకి ప్రవేశించిన రఫేల్ విమానాలకు రెండు సుఖోయ్- 30 ఎంకేఐ విమానాలతో స్వాగతం పలికింది రక్షణ శాఖ. వాటి వెన్నంటే ఉండి అంబాలాకు చేరుకున్నాయి రఫేల్ సూపర్జెట్లు.
राष्ट्ररक्षासमं पुण्यं,
राष्ट्ररक्षासमं व्रतम्,
राष्ट्ररक्षासमं यज्ञो,
दृष्टो नैव च नैव च।।
नभः स्पृशं दीप्तम्…
स्वागतम्! #RafaleInIndia pic.twitter.com/lSrNoJYqZO— Narendra Modi (@narendramodi) July 29, 2020
భారత వైమానిక దళ అమ్ముల పొదిలోకి చేరేందుకు రఫేల్ విమానాలు సోమవారమే ప్రయాణం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరం మెరినాక్ వైమానికి స్థావరం నుంచి బయలుదేరిన ఐదు జెట్‌లు పది గంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఆల్ ధాఫ్రా వైమానికి స్థావరంలో దిగి అక్కడి నుంచి అంబాలాకు వచ్చాయి.మొత్తం ఏడు వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో రఫేల్ జెట్‌లు గాలిలోనే ఇంధనాన్ని నింపుకోగా.. అందుకోసం ఫ్రాన్స్ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్ విమానాన్ని ఏర్పాటు చేసింది.
The Birds have landed safely in Ambala.
The touch down of Rafale combat aircrafts in India marks the beginning of a new era in our Military History.
These multirole aircrafts will revolutionise the capabilities of the @IAF_MCC.
— Rajnath Singh (@rajnathsingh) July 29, 2020
భారత నేలను ముద్దాడిన రఫేల్ విమానాలు దేశ సైనిక చరిత్రలో నవ శకాన్ని ప్రారంభించాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
“అంబాలాలో ఈ పక్షులు సురక్షితంగా దిగాయి. ఇది భారత సైన్య చరిత్రలో నవశకం ప్రారంభానికి చిహ్నం. ఈ బహుళ వినియోగ యుద్ధవిమానాలతో భారత వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుంది అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.