యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన రాశి ఖన్నా..!

-

ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండ్ ఫుల్ గా కొనసాగుతుంది. సామాన్య జనం నుండి సెలబ్రిటీల వరకు సపరేట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ ను పెట్టుకొని వారికి సంబంధించిన విషయాలను యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే ఇప్పటికే ఎంతో మందికి సపరేట్ గా యూట్యూబ్ ఛానల్ లను పెట్టుకున్నారు. వాటి ద్వారా వారు తమ సినిమాలకు సంబంధించిన విషయాలను, వారి పర్సనల్ విషయాలను తన అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి హాట్ బ్యూటీ రాశి ఖన్నా కూడా చేరిపోయింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరెన్నో విషయాలను పంచుకుంటాను అని తాజాగా రాశి ఖన్నా తెలియజేసింది.

ఈ సందర్భంగా రాశి ఖన్నా మాట్లాడుతూ… తాను చాలా రొమాంటిక్‌ పర్సన్‌ అని, తనకు డిన్నర్‌ డేటింగ్స్‌, లవ్‌ లెటర్స్‌ అంటే చాలా ఇష్టమని రాశి ఖన్నా పేర్కొంది. అలాగే తన జీవితంలో వారానికి 20 ఫ్లయిట్‌ జర్నీలు చేస్తానని, త్వరలోనే షూటింగ్‌లో బిహైండ్‌ ది సీన్స్‌ని కూడా చూపిస్తాను అని రాశి ఖన్నా తెలియజేసింది. స్కిన్‌ కేర్‌, జిమ్‌ సహా ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విషయాలను తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పంచుకుంటానని అందుకోసం తన ఛానెల్‌ను లైక్‌, షేర్‌, సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం మర్చిపోవద్దు అని రాశి ఖన్నా తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ, గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితోపాటు రాశి ఖన్నా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version