Rashmika Mandanna: క్యూట్ బ్యూటీ జలకాలట..సమ్మర్‌లో కూల్‌గా ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన

-

క్యూట్ బ్యూటి రష్మిక మందన..ప్రజెంట్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో చాన్సెస్ కొట్టేస్తు్న్న ఈ సుందరి..టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ..అని తేడా లేకుండా అన్ని భాషల్లో చిత్రాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ గ్యాప్స్ లో రెస్ట్ కూడా తీసుకుంటున్నది.

ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన రష్మిక.. సమ్మర్ లో హీట్ ఎక్కువగా ఉండటంతో స్విమ్మింగ్ పైన ఫోకస్ చేసింది. తాజాగా తాను స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను ట్వి్ట్టర్ వేదికగా షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు వీడియోలో స్విమ్ సూట్ లో అందంగా కనబడుతున్న రష్మిక మందన..తాను వాటర్ బేబీ అని చెప్పింది.

ఇటీవల ‘తలపతి 66’ ఫిల్మ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రష్మిక..త్వరలో షూటింగ్ లో జాయిన్ కాబోతుందట. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. రష్మిక మందన..కొరటాల శివ-తారక్ ..NTR30 పిక్చర్ లోనూ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేయడానికి సెలక్ట్ అయినట్లు టాక్. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ పిక్చర్స్ షూటింగ్ లో పాల్గొంటోంది. త్వరలో ‘పుష్ప 2’ షూట్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version