పదవ తరగతి పూర్తయ్యాక ఎక్కువ మంది విద్యార్ధులకి కలిగే ప్రశ్నలివే..!

-

పదవ తరగతి చదివిన తర్వాత విద్యార్థులు టెన్షన్ పడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆందోళన ఉంటుంది. అలానే ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న మెదడులో కలుగుతూ ఉంటుంది. నిజానికి టెన్త్ తర్వాత మంచి నిర్ణయం తీసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది. లేదంటే అనవసరంగా రాంగ్ స్టెప్ వల్ల లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజానికి 15 లేదా పదహారేళ్ళ వయసులో పూర్తి పరిణామాలతో ఆలోచించడం అందరికీ సాధ్యం కాదు.

 

కొందరు మ్యాథ్స్ అంటే భయపడి బయాలజీ తీసుకుంటారు. కొందరికి బయాలజీలో బొమ్మలు ఇష్టం లేదని కామర్స్ తీసుకుంటారు. నిజానికి చాలా మంది గ్రూప్ ని ఎలా ఎంచుకుంటారు అంటే ఒక సబ్జెక్ట్ ఇష్టం లేదని.. ఆ సబ్జెక్ట్ లోకి వెళ్లకుండా మరొక గ్రూప్ ని బెస్ట్ అని అనుకుంటారు. ఉదాహరణకు మ్యాథ్స్ అంటే భయం అయిన వాళ్ళు కచ్చితంగా బైపిసి తీసుకుంటూ ఉంటారు.

అంతే కానీ భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్ అవ్వాలని కానీ ఏవైనా కోర్సు లో జాయిన్ అవ్వాలి అని కాదు. కానీ నిపుణులు ఏమంటున్నారంటే ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం ఉందో దానినే విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని అంటున్నారు. అయితే చాలామంది విద్యార్థులుకు ఎక్కువగా కలిగే ప్రశ్నలివే మరి వాటి కోసం చూద్దాం.

డాక్టర్ అవ్వాలని ఉంది కానీ ప్రయోగాలు రక్తం అంటే భయం..?

బైపిసి అంటే బొద్దింకలను కప్పల్ని కొయ్యాలి. వాటిని చూస్తే చాలామందికి భయం కలుగుతుంది. అందుకని చాలా మంది ఈ కోర్సులు కి దూరంగా ఉంటారు. కానీ బోటనీ, జువాలజీ సబ్జెక్టులపై పట్టు ఉంటే ఏ సందేహం లేకుండా బైపీసీ వైపు వెళ్లడం మంచిది. జంతువులంటే భయం అని ఆగి పోవద్దు దశలవారీగా అది పోతుంది.

ఎంపీసీ అంటే ఇష్టం కానీ లెక్కలు అంటే కష్టం

ఎక్కువ మంది విద్యార్థులు లో ఈ ప్రశ్న కూడా ఉంటుంది. సాధన ద్వారా గణితంలో ప్రావీణ్యాన్ని పొందొచ్చు. కాబట్టి అస్సలు భయపడకండి. కాబట్టి ఒకసారి ఈ విషయంపై ఆలోచించుకోండి. అసలు లెక్కలు అంటే ఇష్టం లేదు అంటే దాని జోలికి వెళ్లొద్దు కానీ సాధనతో వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ గ్రూపు తీసుకోవచ్చు.

సీఏ చెయ్యడానికి ఎంపీసీ, ఎంఈసీ లో ఏది బెస్ట్ ?

సీఏ చేయాలనుకునే వాళ్ళు ఎంఈసీ గ్రూప్ ను ఎంచుకుంటే మంచిది ఈ గ్రూపులో ఉండే ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులు సీఏ ఫౌండేషన్ తో పాటు మిగతా సీఏ కోర్సు కి పనికొస్తాయి. ఎంపీసీ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది వీటివల్ల సిఏ చదువు కి ఎటువంటి ప్రయోజనం కలగదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version