అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడింది.నవంబర్ 5న అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత డెమెక్రటిక్ పార్టీ ఓడిపోబోతుందని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి.తాజాగా మరో సర్వే సైతం వెలువడగా.. అందులోనూ ట్రంప్ విజయం ఖాయమని తేలిపోయింది.
రాస్ మసేన్ (RASMUSSEN POLL) ప్రకారం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌కు 297, డెమెక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్‌కు 241 ఎలక్టోరోల్ ఓట్లు వస్తాయని పేర్కొంది.స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినా, విస్కన్సిన్, నెవడా, పెన్సిల్వేనియా, అరిజోనా, మిచిగాన్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయ కేతనం ఎగురవేస్తారని ప్రిడిక్ట్ చేసింది. కాగా, ట్రంప్ విజయం కోసం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా ప్రయత్నించడంతో పాటు ఆయనకు మద్దతుగా సోషల్ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.