ఉత్తరాదిలో హిందీ చిత్రాలదే డామినేషన్.. ఉదయనిధి స్టాలిన్

-

హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని.. దాన్ని బలవంతంగా రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. భాషను రుద్దడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినవే ద్రవిడ ఉద్యమాలు అని పేర్కొన్నారు. దక్షిణాది తరహాలో ఉత్తరాది రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు లేకపోవడం పెద్ద లోటని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో విఫలమైతే.. హిందీ ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు మనోరమ డెయిలీ గ్రూప్ నిర్వహించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.


జాతీయవాదం, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణా
నిధి వంటి వారు తమిళ సాహిత్యాన్ని విస్తృతంగా వినియోగించారని ఉదయనిధి అన్నారు. తద్వారానే ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని గుర్తుచేశారు. సంస్కృతి, భాషాధిపత్యానికియ వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమమని పేర్కొన్నారు. 1930ల్లో, 1960ల్లో హిందీని అధికారిక భాషగా గుర్తించడానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమాలు జరిగాయన్నారు. ఇప్పటికీ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు ‘జాతీయవాదులు’ ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ పై విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version