మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి. దీని వలన ఎన్ని లాభాలు వున్నాయి. అయితే లక్షలకుపైగా నకిలీ, ఫేక్ అనర్హులకు చెందిన రేషన్ కార్డులను ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది.
పూర్తి వివరాలను చూస్తే.. 2017 నుంచి 2021 వరకు దేశంలో చలామణీలో ఉన్న 2 కోట్ల 41 లక్షలకుపైగా ఫేక్ అనర్హుల రేషన్ కార్డ్స్ ని తొలగించారు. దీని మూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ధ్రువీకరణ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది.
ఎవరు అనర్హులు:
వంద చదరపు మీటర్ల మేర ఇల్లు, లేదా ప్లాట్ ఉంటే వాళ్ళు రేషన్ కార్డుకి అనర్హులు.
ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధ లైసెన్స్ వున్నా అర్హులు కారు.
గ్రామాల్లో ఆదాయం రూ.2 లక్షల కంటే ఎక్కువ వున్నా అర్హులు కారు.
అదే విధంగా పట్టణాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వుండకూడదు.
అయితే అర్హులు కానీ వాళ్లకు కనుక ఈ కార్డు ఉంటే డీఎస్‍ఓ ఆఫీసులో సరెండర్ చెయ్యాలి.
ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ పథకంలో భాగముగా ఒక అతను బెంజ్ కారులో వచ్చి రేషన్ ని పంజాబ్ హోషియార్‌పుర్ లో తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన వైరల్ అయ్యింది. అందుకే నకిలీ రేషన్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం వర్క్ చేస్తోంది.