తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..నేటి నుంచి కాలేజీలు బంద్.. కానున్నాయి. ఫీజు రీయంబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులకు నిరసనగా నేటి అంటే మంగళవారం నుంచి డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలపునిచ్చాయి. ప్రభుత్వం రూ.2 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం స్పష్టంచేసింది.
బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని, కాలేజీలు బంద్‌లో పాల్గొనాలని సంఘం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బంద్ కానున్నాయి. ఈ తరుణంలోనే.. రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.