తెలంగాణ రేషన్ కార్డులకు బిగ్ షాక్.. ఇక సన్న బియ్యం పంపిణీ ఇప్పట్లో లేనట్టే!

-

తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సన్న బియ్యం పంపిణీ మరింత ఆలస్యం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదే పదే చెప్పి… మాట దాటవేసింది. అయితే కొత్త రేషన్ కార్డుల విషయాన్ని పక్కకు పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్… కొత్తగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువచ్చింది. సన్న బియ్యం పంపిణీ సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు తో పాటు… తెలంగాణ మంత్రులందరూ ప్రకటించేశారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కానుందట.

cm revanth reddy, ration cards, rice

సంక్రాంతి కాదు మరో మూడు నెలల తర్వాత.. ఈ సన్న బియ్యం పంపిణీ ఉంటుందట. కొత్త ధాన్యాన్ని వెంటనే మీల్లింగ్ చేస్తే బియ్యం లో నూక శాతం పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే మనం అన్నం వండుకుంటే అది… మెత్తగా లేదా ముద్దగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ధాన్యం బాగా మాగాలి. దీనికి మూడు నెలల సమయం పడుతుంది. అంటే మార్చి లేదా ఏప్రిల్ నెల వరకు… ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టే ఛాన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో రేషన్ కార్డులకు నిరాశ ఎదురయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version