హైదరాబాద్‌లో రేవ్ పార్టీ..అబ్బాయిలు,అమ్మాయిల అరెస్టు!

-

నగరంలో మరోసారి రేవ్ పార్టీ కల్చర్ హంగామా సృష్టించింది. పార్టీలో గంజాయి, డ్రగ్స్‌‌, మద్యం సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో ఒక్కసారిగా పోలీసులు రైడ్స్ చేశారు. ఈ రేవ్ పార్టీ వెనుక చాలా పెద్దవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం రేవ్ పార్టీలో భాగమైనట్లు సమాచారం. అయితే, హైదరాబాద్ మహానగరంలో మత్తు కల్చర్ నానాటికీ పెరిగిపోతోంది. యువతీ, యువకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ బంగారం లాంటి భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారు.

రేవ్ పార్టీలకు అలవాటు పడిన కొందరు యువత మత్తు, గంజాయిని తెగ లాగించేస్తున్నారు. తాజాగా నగరంలో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో గంజాయి, మాదక ద్రవ్యాలు కలకలం రేపాయి. ఇందులో సాఫ్ట్ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలుస్తోంది. అయితే, వీరి వెనుక కూడా ఎవరో ఉన్నట్లు గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ గెస్టుహౌస్‌పై చేసిన దాడిలో పెద్ద ఎత్తున గంజాయి, మద్యం సేవిస్తున్న 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.‘రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు.వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. ఇంతకుముందు ఇలాంటి పార్టీలు ఎన్ని నిర్వహించారు? దీని వెనుక ఉన్నది ఎవరు’ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version