తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల ప్రకటన పై ఆయన భార్య ఆర్తి రవి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు బలవంతంగానే విడాకులు ఇచ్చారంటూ బాంబ్ పేల్చారు భార్య ఆర్తి రవి. తాజాగా తమిళ హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంపై ఆయన భార్య ఆర్తి రవి విచారం వ్యక్తం చేశారు.
తన ప్రమేయం లేకుండానే ఈ ప్రకటన చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయమై తన భర్తతో మాట్లాడుదామని అనుకున్నా అవకాశం లేకపోయిందని వాపోయారు. తన వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ క్లిష్ట సమయంలో పిల్లల సంరక్షణపై దృష్టి పెడుతానని చెప్పారు భార్య ఆర్తి రవి. కాగా, రెండు రోజుల కిందటే… తమిళ స్టార్ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి రవి విడాకులు తీసుకున్నారు.