బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసీస్ మధ్య జరిగిన ఆఖరి నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడు రోజుల ఆట పూర్తయ్యే సమయానికి ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అర్థమైపోయింది. ఇలాంటి సమయాల్లో సాధారణంగా కెప్టెన్లు ప్రయోగాలు చేస్తుంటారు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ ప్రయోగం చేశాడు. ఎప్పుడూ బ్యాటింగ్ చేసే పుజారాతో బౌలింగ్ చేయించాడు. అలాగే యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్‌తో కూడా బంతిని వేయించాడు.
తాజాగా పుజారా బౌలింగ్ చేయడంపై స్పందించాడు టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. “నువ్వు బౌలింగ్ చేస్తే నేనేం చెయ్యాలి? బౌలింగ్ మానేయాలా?” అంటూ సరదాగా చమత్కరించాడు. ఫన్నీగా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
అశ్విని ట్వీట్‌కు పుజారా స్పందిస్తూ.. ‘వద్దు నాగ్‌పుర్ టెస్టులో నువ్వు వన్ డౌన్లో వెళ్లినందుకు నేను ఇలా థ్యాంక్స్ చెబుతున్నా’ అని పుజారా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందిస్తూ.. అశ్విన్ ‘నీ ఉద్దేశం బాగానే ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక వీరిద్దరి సంభాషణ ఇప్పుడు ట్విటర్లో వైరల్‌గా మారింది.
Nahi. This was just to say thank you for going 1 down in Nagpur 😂 https://t.co/VbE92u6SXz
— Cheteshwar Pujara (@cheteshwar1) March 13, 2023