మాస్ జాతర మనదే ఇదంతా అంటూ వచ్చేసిన రవితేజ..రిలీజ్ ఎప్పుడంటే ?

-

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఇటీవల RT 75 సినిమాని ప్రకటించిన
సంగతి తెలిసిందే. జూన్ 11న రవితేజ 75వ సినిమా పూజాకార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు రవితేజ 75ను నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో రవితేజ సరసన కుర్రాళ్ల కళల రాణి శ్రీలీల నటిస్తున్నారు. ఈ ఇద్దరు 2022లో వచ్చిన ధమాకా సినిమాలో నటించారు. ఆ చిత్రంలో రవితేజ, శ్రీలీల జోడి అందరినీ ఆకట్టుకుంది. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చుస్తున్నారు. ఈ సినిమాకి మాస్ జాతర మనదే ఇదంతా అనే టైటిల్ ని తాజాగా దీపావళి సందర్భంగా అనౌన్స్ చేశారు మేకర్స్. అలాగే మే 09, 2025న రిలీజ్ అవుతుందని ప్రకటించేశారు.  మాస్ జాత‌ర మూవీ పోస్ట‌ర్ విడుద‌ల‌ చేశారు.  దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెబుతూ త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు  ప్రొడ్యూస‌ర్ నాగవంశీ. ఈ పోస్టర్ లో  చేతిలో గంట‌.. న‌డుము వ‌ద్ద గ‌న్‌తో వెరైటీ లుక్‌లో హీరో ర‌వితేజ‌ కనిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version