మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ పోషించే పాత్ర ఇదే!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం గత నెల 29న విడుదలైంది. అయితే, ఈ సినిమాకు తొలి రోజు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. కాగా, మెగా అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ లను వెండితెరపైన చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంగతులు పక్కనబెడితే..చిరంజీవి, రామ్ చరణ్..ఇద్దరూ తమ నెక్స్ట్ మూవీస్ పైన ఫోకస్ పెట్టేశారు.

రామ్ చరణ్ ..RC15 షూటింగ్ కోసం ఏపీలోని వైజాగ్ కు వెళ్లాడు. చిరంజీవి వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లాడు. చిరు..వెనక్కు రాగానే MEGA 154 స్టార్ట్ అవుతుందని టాక్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను ఇటీవల ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో చిరంజీవి లీక్ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ గా మెగాస్టార్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించనున్నారని టాక్. మూవీ స్టోరిని మలుపు తిప్పే కీలక పాత్రలో మాస్ మహారాజా ఉంటారని వినికిడి. ఇక ఇందులో మెగాస్టార్ మాస్ లుక్ తో పాటు క్లాసీ లుక్ లో కనిపిస్తారట.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానూ కొద్ది సేపు అలరిస్తారని సమాచారం. త్వరలో ఈ సినిమా కాస్టింగ్, రవితేజ రోల్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version