పదవ తరగతి పూర్తి చేసారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్లో 57 ఖాళీలు ఉన్నాయి. 2021 మార్చి 15 చివరి తేదీ లోగ అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలను https://rbi.org.in/ లేదా https://opportunities.rbi.org.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
రిక్రూటింగ్ ఆఫీస్ పరిధి లోని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో పాస్ అయి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఈ పోస్టులకు అర్హులు గమనించండి. గ్రాడ్యుయేట్స్ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు అప్లై చెయ్యకూడదు. అలానే 18 నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. 1996 ఫిబ్రవరి 2 నుంచి 2003 ఫిబ్రవరి 1 లోపు జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దీని కోసం దేశవ్యాప్తంగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అది అయ్యాక లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ స్థానిక భాష లో ఉంటుంది.