మూడు నెలల పాటు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు: కేంద్రం

-

మూడునెలలపాటు ఎటువంటి ఈఎంఐలు కట్టక్కర్లేదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. అంటే మన లోన్‌ కాల పరిమితి అదనంగా మూడునెలలు పెరుగుతుంది. అంతే. మూడునెలల తర్వాత కాంపౌండ్‌ వడ్డీ కలిపి వసూలు చేయడం కూడా ఉండదు.

ఆర్బీఐ చీఫ్ శక్తికాంతదాస్ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.  కరోనా మహమ్మారి నేపథ్యంలో నీడీపీపుల్‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించ‌గా ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్ర‌క‌ట‌న  దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎంతో మందికి ఊర‌ట క‌లిగించింది.  ముఖ్యంగా ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు సంబంధించి శ‌క్తికాంత దాస్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో వేత‌న జీవుల‌కు భారీ ఊర‌ట ల‌భించింది.  లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి వ‌ల్ల‌ ఉద్యోగులు, వ్యాపారులపై ఒత్తిడి లేకుండా 3  నెల‌ల వ‌ర‌కు వారు తీసుకున్న లోన్ల‌పై ఈఎంఐలు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేకుండా ఆర్‌బీఐ అన్ని లోన్ల‌పై 3 నెల‌ల వ‌ర‌కు మార‌టోరియం  విధించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో లోన్లు కట్టలేని, క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి కాస్త ఊరట కల్పించాలని చాలామంది కోరారు. కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న వ్యాపారస్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే పరిస్థితిలో లేమని ఇప్పటికే చేతులెత్తేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌, పర్యాటక, ఆతిథ్యరంగాల వ్యాపారాలు కరోనాతో కుదేలయ్యాయి. వీటితో పాటు మరెన్నో రంగాలు నష్టాల్లో ఉన్నాయి. వ్యాపారాలు పూర్తిగా మూత పడడంతో కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాల కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించలేమని పలు సంస్థల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా మూడు వారాల లాక్ డౌన్ దేశ భద్రత కోసమే. కానీ సామాన్య, మధ్య తరగతులకు మాత్రం ఈఎంఐ, క్రెడిట్ కార్డు పేమెంట్స్ టెన్షన్ పట్టుకుంది. దీంతో  కొద్ది రోజులు తమ పేమెంట్స్ ఆపాలని అంద‌రూ కోరారు. సోషల్ మీడియాలోను ఈ దిశగా స్పందించారు. నెల సంపాదన ఆధారంగా చాలామంది హోమ్ లోన్, వెహికిల్ లోన్, ఇతర లోన్స్ తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆర్‌బీఐ నిర్ణ‌యం వ‌ల్ల ఎంతో మందికి భారీ ఊర‌ట ల‌భించింది.
కరోనా ప్రభావంతో రేపో రేట్ ని ఆర్‌బీఐ 4.4 కి తగ్గించింది. రివర్స్ రేపో రేట్ 4 శాతం తగ్గించింది. దీంతో లోన్ల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌నున్నాయి. మ‌రోవైపు ఆహార‌  ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని శ‌క్తికాంత‌దాస్ తెలిపారు. ఆర్ధిక స్థిరత్వం కోసం రెపో రేట్స్ ని త‌గ్గించిన‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇక 150 మంది ఆర్బిఐ ఉద్యోగులను క్వారంటైన్ చేశామని శ‌క్తికాంత‌దాస్‌ వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ మరింత దిగజారే అవకాశం ఉందని ఆయన అన్నారు.
రుణ చెల్లింపుదారులకు ఊరట కలిగించే విధంగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని శ‌క్తికాంత‌దాస్‌ సూచించారు. నిధుల కొరత లేకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రీపేమెంట్స్ సులభతరం చేస్తామని, త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆయన వివరించారు. అన్ని లోన్ల‌ ఈఎంఐలపై 3 నెలలు మారిటోరియం విధిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కరోనా ప్రభావం ఎంత కాలం అనేది చెప్పలేమని, ప్రభుత్వం ఇచ్చిన సూచనలను అందరూ పాటించాలని ఆయన అన్నారు.
 
టర్మ్ లోన్ ఈఎంఐలపై మార్చి 1 నుంచి 3 నెలల పాటు మారిటోరియం కొన‌సాగుతుంద‌ని శక్తికాంత దాస్   పేర్కొన్నారు. జూన్ 2020 వరకు మారిటోరియం కొనసాగుతుందని ఆయన వివరించారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రజల సొమ్ము సుర‌క్షితంగా ఉంటుంద‌ని తెలిపారు. అలాగే  భారత బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టం గా ఉందని చెప్పారు. ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటేనే భవిష్యత్తులో ఆర్ధిక సమస్యలు రావని అన్నారు. ఇక వినియోగ‌దారులు ఈఎంఐలు కట్టకపోయినా స‌రే.. వారి సిబిల్ స్కోర్ పై మాత్రం ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని ఆయ‌న తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version