“రక్తం మరుగుతోంది”.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన ప్రస్తావన తెచ్చారు ప్రధాని మోదీ. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన భయంకరమైన దాడిని మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు మోదీ. ఇలాంటి సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా, ధృడంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

ఇక అటు దేశంలో అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. 15వ ఎడిషన్ రోజ్ గార్ మేళాలో 51,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అనంతరం ఆయన ప్రసంగించారు. 90 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 10 కోట్ల మంది మహిళలు చేరారని పేర్కొన్నారు. ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. అన్ని రంగాలలో యువతకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.