బ్రేకింగ్ : ఏపీలో ఎన్నికల నిర్వహణకి సిద్దం !

-

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఏపీ హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాలెట్ బాక్సుల లభ్యతను బట్టి వివిధ దశల్లో ఎన్నికల షెడ్యూలు కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిన కారణంగా ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

గతంలో కరోనా కేసుల వలనే ఎన్నికల వాయిదా వేశామని అయితే గతం కంటే ఇప్పటి పరిస్థితి మెరుగుపడిందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయాన్ని అఫిడఫిట్ లో పొందుపర్చారు. అయితే గత అనుభవాల దృష్ట్యా, ఈ సారి పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సి ఉందని దానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించి తీరాల్సిందేనని అఫిడఫిట్ లో స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version