ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఇప్పుడు టీవీ లను కూడా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లో ఈ కంపెనీ నుంచి వచ్చిన టీవీ లు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో కొత్త స్మార్ట్ టీవీని మార్కెట్ లోకి లాంచ్ చేశారు.ఆ టీవీకి గతంలో ఉన్న టీవీ లకు వ్యత్యాసాలు, ధర మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఎఫ్‌హెచ్‌డీ సిరీస్ భారత్‌లో విడుదలైంది. 40 ఇంచుల, 43 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్‌లో ఫుల్‌హెచ్‌డీ రెజల్యూషన్ తో ఈ కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయి. అంతేకాదు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న నాలుగు స్పీకర్లు ఈ టీవీల్లో ఉండగా.. గరిష్ఠంగా 24వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఇస్తాయి. ఈ కొత్త రియల్‌మీ స్మార్ట్ టీవీలు బెజిల్‌లెస్ డిజైన్‌లో వస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీల ఫీచర్ల విషయాన్నికొస్తే..
రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఎఫ్‌హెచ్‌డీ 40 ఇంచుల మోడల్ ధర రూ.22,999గా ఉంది. 43 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.25,999గా రియల్‌మీ నిర్ణయించింది. 40 ఇంచుల మోడల్ సేల్ మే 4న మొదలవుతుంది. 43 ఇంచుల వేరియంట్ మే 5న అమ్మకానికి వచ్చింది.ఈ టీవీ లు ఆన్ లైన్ లో లేదా రియల్ మీ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి..HDR 10, HGL ఫార్మాట్లకు ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ వల్ల ఈ టీవీలు అల్ట్రా బ్రైట్‌నెస్ కలిగి ఉంటాయి. ఇక ఈ టీవీలు 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై టీవీ లు పని చేస్తున్నాయి.టీవీ లో మనకు కావలసిన యాప్ లను
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్న నాలుగు స్టీరియో స్పీకర్లు ఈ టీవీలకు ఉంటాయి. మొత్తంగా 24W సౌండ్ ఔట్‌పుట్‌ను ఇస్తాయి. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ లను కూడా సపోర్ట్ చేస్తాయి.వీటితో పాటు మరి కొన్ని ఫీచర్లు ఈ టీవీలకు గలవు.