ఈ నెల 22న లాంచ్‌ కానున్న Realme Narzo 50i Prime

-

రియల్‌మీ నార్జో నుంచి 50I ప్రైమ్‌ ఈ నెల 22న లాంచ్‌ కానుంది. రియల్‌మీ నుంచి అత్యంత చవకైన రియల్‌మీ ఫోన్ ఇదేనట. లీకైన సమాచారం ప్రకారం.. ఫోన్‌ ఫీచర్స్‌, స్పెసిఫికేషన్ల్‌ ఎలా ఉన్నాయో చూద్దామా..!

రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ ధర (అంచనా)

ఈ స్మార్ట్ ఫోన్ ధర 100 డాలర్ల (సుమారు రూ.7,800) రేంజ్‌లో ఉండనుందని తెలుస్తోంది.
రియల్‌మీ ఈ సంవత్సరం లాంచ్ చేయనున్న అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదే కానుంది. బ్లాక్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ స్పెసిఫికేషన్లు

దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
ఇందులో వెనకవైపు ఒక్క కెమెరా ఉండనుంది. ఎల్ఈడీ ఫ్లాష్, నార్జో బ్రాండింగ్ కూడా వెనకవైపు ఉన్నాయి.
టెక్స్చర్డ్ డిజైన్, వర్టికల్ స్ట్రిప్స్ కూడా అందించారు.
సన్నటి అంచులను ఇందులో చూడవచ్చు. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్‌ను అందించారు.
వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, సిమ్ ట్రేలు ఫోన్‌కు ఎడమవైపు ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 181 గ్రాములుగా ఉంది.

ఎన్బీటీసీ, యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ (ఈఈసీ), యూఎస్ ఎఫ్‌సీసీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్ సైట్లలో కూడా ఈ ఫోన్ కనిపించింది. రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇప్పుడు బడ్జెట్‌ ఫోన్లదే హవా నడుస్తుంది. చూడాలి ఈ ఫోన్‌ సాధారణ కష్టమర్స్‌ను ఆకట్టుకుంటుందో లేదో.!

Read more RELATED
Recommended to you

Exit mobile version