తెలంగాణలోని రియల్టర్స్ అసోసియేషన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద సీరియస్ అయ్యింది.రియల్ వ్యాపారులు చావాలా బతకాలా? అంటూ ప్రశ్నించింది. ఫార్మ్ ల్యాండ్స్ కొనొద్దని ప్రజలకు చెప్పే అధికారం హైడ్రాకు ఎక్కడిది? అంటూ రియల్టర్లు నిలదీశారు. ఇప్పటివరకు మీరు చేసిన కూల్చివేతల వల్ల ఎన్ని చెరువులను కాపాడారు?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే LRSను రద్దు చేస్తామని, జీపీ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని ఇచ్చిన హామీ రంగనాథ్ కు తెలియదా? చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల మీద మాత్రమే హైడ్రాకు హక్కు ఉంది.ఫార్మ్ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాలు కాదు,వాటి గురించి మాట్లాడే హక్కు హైడ్రాకు లేదు.రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బతకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రంగనాథ్ పట్ల రియల్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఫైర్ అయ్యింది.