రాష్ట్రంలోని రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. యాసంగి సాగు కోసం ఇప్పటికు వరి నాట్లు వేసిన రైతులు యూరియా కోసం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. స్టాక్ లేకపొవడంతో కిలో మీటర్ల మేర బారులు తీరాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పీఏసీఎస్‌లో యూరియా బస్తాలు సరిపడా ఇవ్వడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అవసరం ఉన్న మేరకు సరఫరా చేయకుండా పరిమితిగా ఇస్తే ఏం చేసుకోవాలని, తమకు పంట దిగుబడి రావాలా? వద్దా? అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/TeluguScribe/status/1892399020905288167