అత్యంత క్లిష్టమైన సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ .. కేంద్రంలోని బీజేపీతో దోస్తీ కట్టారు. నేడు ఆయన నేరుగా ఢిల్లీలో ప్రధాని మోడీతోనూ భేటీ అవుతున్నారని సమాచారం. నిజానికి 2017-2019 మధ్య ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ప్రభుత్వాన్ని నిల దీస్తానని, రోడ్డుకు లాగుతానని అన్న పవన్.. యాక్టర్లు అందరూ పొలిటీషియన్లు కాలేరని చెప్పిన బీజేపీ నాయకులు నేడు చేతులు కలిపి చెట్టాపట్టాలేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రజలకు మా త్రం అనేక సందేహాలు ఉన్నాయి.
నేడు రాజధాని విషయంలో కేంద్రం పట్టించుకుంటుందని రాజధాని ప్రాంత ప్రజలు ఆశలు పెట్టుకు న్నారు. అయితే, ఈ విషయంలో కేంద్రం పట్టించుకోలేదు. గతంలో హోదా విషయంలో పట్టించుకోనట్టే.. ఇప్పుడు కూడా రాజధాని విషయంలోనూ స్పందించడం లేదు. ఈ పరిణామంతో రాజకీయంగా పవన్ ఇ ప్పుడు బీజే పీతో దోస్తీ చేయడంపై రాజధాని వాసులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. పవన్ వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు.
కానీ, తాజాగా పవన్ ప్రసంగం విన్నవారికి మాత్రం పవన్ పై ఆశలు సన్నగిల్లా యి. ఇవన్నీ ఇలా ఉంటే.. బీజేపీ వ్యూహానికి, పవన్ ఎత్తుగడకు మధ్య లింకు సరిపో యిందని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం పార్టీని నిలబెట్టుకునేందుకు పవన్‌కు కేంద్రంలోని బీజేపీ సాయం చేసేందుకు ముందుకు వ చ్చిందని ఢిల్లీలోని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక, రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించేందుకు సరైన నాయకత్వం లేని కారణంగా.. బీజేపీ పవన్‌ను ఓన్ చేసుకునేందుకు సిద్ధమైందని అంటున్నారు.
వాస్తవానికి పవన్ పార్టీని విలీనం చేయాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామంటూ.. బీజేపీ నాయకు లు పలుమార్లు చెప్పారు. ఇదే విషయంపై పవన్ కూడా పలుమార్లు స్పందించారు. తాము విలీనం చేసే ప్రసక్తి లేదన్నారు. మొత్తంగా ఇప్పుడు వెళ్లి బీజేపీతో చేతులు కలిపారు. ఈ పరిణామాలను బట్టే ఢిల్లీ వర్గాలు ఓ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. రెండు పార్టీల పరస్పర ప్రయోజనం కోసమే చేతులు కలిపారని అంటున్నారు. సో.. ఈ ప్రయోజనాలు ఎన్నాళ్లు కొనసాగుతాయో చూడాలి.