ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ పరిస్థితి చూస్తే ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా అమరావతి రాజధాని విషయంలో వ్యవహరిస్తున్నారు. తాజాగా వైయస్ జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణ పేరిట పరిపాలన రాజధాని అదేవిధంగా శాసన రాజధాని మరియు న్యాయ రాజధాని అంటూ విశాఖపట్నం అమరావతి కర్నూల్ పేర్లను తెరపైకి తీసుకువచ్చి వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం అయ్యేలా చూడటం జరిగింది.
అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది బీజేపీ నేతలు అమరావతిలోని రాజధానిని ఉంచాలని కోరుతూ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ విషయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏపీ బిజెపి పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉందని అది రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారమని తేల్చిచెప్పడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ బీజేపీ నేతలంతా ఒకలా మాట్లాడుతుంటే జీవీఎల్ మరొకలా మాట్లాడి బిజెపి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఏపీ లో ఉన్న కొంతమంది బిజెపి నేతలు జీవీఎల్ వ్యవహారంపై హైకమాండ్ కి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లు జీవీఎల్ జగన్ సర్కార్ కి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే జీవియల్ మాత్రం హైకమాండ్ పెద్దలు ఆలోచనల మేరకు రాష్ట్రంలో నడుచుకుంటన్నట్లు ఇదే ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి.