ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం : డబ్బులు తిరిగి చెల్లింపు

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థుల ఫలితాలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకోసం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలలో అవకతవకలు జరిగాయంటూ ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అయితే 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అయితే బుధవారం సీఎం కేసీఆర్ సమీక్షించిన విషయం తెలిసిందే. అయితే ఫెయిలైన విద్యార్థులకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంవత్సరం కోల్పోకుండా ఈ ప్రక్రియంతా వీలైనంత వేగం పూర్తికావాలన్నారు.

దరఖాస్తూ చేసుకోకున్నా రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌

అయితే తాజాగా ఇంటర్‌ బోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోయినా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేస్తామని ప్రకటించింది. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు అప్టై చేయటానికి ఇంటర్‌నెట్‌ కేంద్రాల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మే 15లోపు ఫలితాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. మెమోలు నేరుగా విద్యార్థుల ఇంటికే వస్తాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version