కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లొంగిపోవాల్సిందే.. కోర్టులో చుక్కెదురు

-

కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అజ్ఞాతంలోకి వెళ్లిన కొండాను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగించాడంటూ విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ష్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విషయంలోకెళ్తే.. కొండా విశ్వేశర్‌రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ తరుపున లోక్‌సభకు పోటీ చేశారు. ఎన్నికల ఇంకా రెండు రోజులు ఉన్నాయనంగా.. ఆయన బంధువు, అడ్వకేట్‌ సందీప్‌రెడ్డి కారులో తరలిస్తున్న రూ.10 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డారు. విచారణలో ఆ డబ్బు విశ్వేశర్‌రెడ్డికి సంబంధించిందని, ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నట్లు తేలింది. విశ్వేశ్వర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు నేరుగా ఆయన నివాసానికి గచ్చిబౌలి ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ వెళ్లారు. అప్పుడు వారిద్దరిని కొండా అనుచరులు నిర్భందించారు. ఈమేరకు కొండా విశ్వేశర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కోర్టులో చుక్కెదురు

అయితే ఈ కేసుపై విచారణనకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పందించకపోవడం, గత వారం నుండి ఎక్కడా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ కోసం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన పిటిషన్‌ కొట్టివేసింది. దీంతో కొండాను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version