
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరిగిపోతుంది దాంతో పాటే రికవరీ రేటు కూడా కొంత మేరకు పెరిగింది. రాష్ట్రం లో నిన్న ఒక్కరోజులు 945 కొత్త కేసులు నమోదు కాగా ఏకంగా 1712 మంది బాధితులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెహెంసీ పరిధిలో నిన్న ఒక్కరోజు 869 కేసులు నమోదయ్యాయి. కాగా రంగారెడ్డి జిల్లా లో 29 కేసులు సంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చెల్ 13 కేసులు వెళ్లదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16339 కి చేరింది ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 8785 కి చేరింది. మరణాల సంఖ్య 260 గా నమోదయ్యింది.