జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్.. 125 ఏళ్ల క‌నిష్టానికి ఉష్ణోగ్ర‌త‌లు

-

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కు ఉష్ణోగ్ర‌త‌లు తీవ్రం గా ప‌డిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో చలి తీవ్ర‌త పెరుగుతంది. రాష్ట్రంలో ప‌లు జిల్లాలో ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం క‌న్నా.. రెండు నుంచి ఐదు వ‌ర‌కు త‌క్కువ గా న‌మోదు అవుతున్నాయి. ఉమ్మ‌డి అదిలాబాద్ జిల్లాలో 125 ఏళ్ల క‌నిష్టానికి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. దీంతో ఆయా జిల్లాలో రాష్ట్ర వాతావ‌ర‌ణ కేంద్రం రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. మంగ‌ళ వారం తెల్ల‌వారు జామున కుమురం భీం జిల్లాలో గిన్నెధ‌రి లో అత్యల్పం గా 3.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు అయింది. 125 ఏళ్ల‌లో ఇంత క‌నిష్ట ఉష్ణోగ్ర‌త ఎప్పుడూ న‌మోదు కాలేద‌ని రాష్ట్ర వాతావ‌ర‌ణ శాక అధికారులు తెలిపారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ఉష్ణోగ్ర‌త‌లు రెండు సార్లు మాత్ర‌మే న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. అలాగే ఈ ఏడాదిలో ఉమ్మ‌డి అదిలాబాద్ జిల్లాలో 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్ర‌త నే న‌మోదు అవుతుంద‌ని తెలిపారు. ఇదీల ఉండ‌గా ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో 8.4 డిగ్రీలు, హైదరాబాద్ లో 9.5 డిగ్రీలు న‌మోదు అయ్యాయి. అలాగే మ‌రో రెండు రోజుల పాటు ఉష్ణోగ్ర‌త‌లు ఇంకా ప‌డిపోయే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెల‌పారు. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు చ‌లి ప‌ట్ల అప్ర‌మ‌త్తం గా ఉండాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news