సెకండ్ హ్యాండ్ అంటూ నాగ చైతన్య ఫాన్స్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన సమంత !

అక్కినేని నాగచైతన్య, టాలీవుడ్ హీరోయిన్ సమంత గత మూడు నెలల కింద విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన చేసిన అనంతరం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హీరోయిన్ సమంత పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంకా సమంత ని టార్గెట్ చేస్తూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొంతమంది నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ సమంతను టార్గెట్ చేస్తున్నారు. అయితే తాజాగా… ఫోన్ నటించిన హద్దులు మీరి కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన సమంత ఘాటుగా రిప్లై ఇచ్చింది. వివరాల్లోకి వెళితే… నెటిజన్ ట్వీట్ చేస్తూ…”సమంత.. విడాకులు తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్. ఒక జెంటిల్మెన్ నుంచి అన్యాయంగా 50 కోట్లు దోచుకుంది.”అంటూ దారుణంగా ట్రోల్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై సమంత కూడా ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. ” నీ ఆత్మకు ఆ దేవుడు శాంతి కలిగించాలి” అంటూ సమంత రిప్లై ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక కొంతమంది ఈ విషయంలో సమంతను సపోర్ట్ చేస్తూ ఉంటే… మరికొంత మంది నెటిజన్లు నాగచైతన్య కు అండగా నిలుస్తున్నారు.