మీరు మీ ఐజిఎల్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) బిల్ ను తగ్గించాలని చూస్తున్నట్లయితే, ఐజిఎల్ మీకు ఆ అవకాశం ఇస్తుంది. మీరు సెల్ఫ్ బిల్లింగ్ చేయడం ద్వారా మీ బిల్లును తగ్గించుకోవచ్చు. అలా చేయడానికి, మీరు చేయాల్సిందల్లా ఐజిఎల్ కనెక్ట్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయడమే. సెల్ఫ్ బిల్లింగ్ చేయడం ద్వారా మీ తదుపరి బిల్లింగ్ లో మీ వంట గ్యాస్ బిల్లును రూ .15 తగ్గించవచ్చు. సాధారణంగా, కస్టమర్ ఇంటి ఆవరణ నుండి ప్రతి 2 నెలలకు ఒకసారి మీటర్ రీడర్ మీటర్ లో ఎంత రీడింగ్ నమోదు అయిందో సేకరించిన తర్వాత పిఎన్‌జి బిల్లింగ్ జరుగుతుంది.
అయితే ఈ స్వీయ-బిల్లింగ్ అంటే ఒక కస్టమర్ ఐజిఎల్ కనెక్ట్ యాప్ ద్వారా మీటర్ రీడింగ్‌ను మీరే స్వయంగా నమోదు చేయడం 15 రూపాయలు తగ్గుతుంది. ఇక గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్ నుండి ఐజిఎల్ కనెక్ట్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ బిల్లింగ్‌కు 15 రూపాయల తగ్గింపు 2021 డిసెంబర్ 31 వరకు చెల్లుతుంది. వినియోగదారులు ఆరు సెల్ఫ్-బిల్లింగ్ ప్రయత్నాల వరకు ఈ డిస్కౌంట్ పొందవచ్చు. సెల్ఫ్ బిల్లింగ్ తరువాత తదుపరి బిల్లులో ఈ తగ్గింపు అందించబడుతుంది.