మార్చి 20 నుంచి RC16 రెగ్యులర్ షూటింగ్

-

డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో నటించనున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు. అభిమానులకి గుడ్ న్యూస్ అందించింది చిత్ర యూనిట్.ఈ నెల 20న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం .

ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.RC 16 మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనుంది. ఇంకా సెకండ్ హీరోయిన్ గా కృతి సనన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుకుమార్‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రాలకు సంబంధించి కొన్ని క్రేజీ అప్‌డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version