ప్రపంచకప్ జట్టులో కోహ్లి కచ్చితంగా ఉండాలి: కృష్ణమాచారి శ్రీకాంత్

-

జూన్‌ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్ 2024 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

T 20 ప్రపంచకప్ ఇండియా జట్టు నుంచి విరాట్ కోహ్లిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు . భారత్ గెలవాలంటే కింగ్ కోహ్లి కచ్చితంగా జట్టులో ఉండాలని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘గత T20 WCలో టీమ్ ని సెమీస్ కి చేర్చింది కోహ్లినే. అతడు జట్టులో ఉండడని చెప్పిందెవరు? ఈ రూమర్స్ క్రియేట్ చేసే వారికి వేరే పనేం లేదా? దేన్ని ఆధారంగా చేసుకుని వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు?’ అని ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు.ఇక జూన్ 5వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version