BREAKING : ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

-

BREAKING : ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయింది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ ను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్‌ కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ కార్య క్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా పాల్గొన్నారు. మే మాసం 2 వ తేదీ నుంచి మే 13 వ తేదీ వరకు టెన్త్‌ క్లాస్‌ ఆన్వల్‌ పరీక్షలు జరుగనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన చేశారు.

అలాగే.. ఏప్రిల్‌ 8 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 28 వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అలాగే…. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ ను మార్చి 11 వ తేదీ నుంచి మార్చి 31 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version