పిఎమ్ కిసాన్ నిధుల విడుదల..ఎవరెవరికి డబ్బులు వస్తాయంటే?

-

మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు వరుస గుడ్ న్యూస్ లు చెబుతున్న విషయం తెలిసిందే..రైతుల కోసం పిఎమ్ కిసాన్ పథకం అమల్లో ఉందన్న విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం వచ్చే వారమే నిధుల్ని విడుదల చేసే అవకాశం ఉంది. పీఎం కిసాన్ రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి 2022 మే 31 చివరి తేదీగా ఉంది..ఈ నెల 31న నిధులను విడుదల చెస్తామని చెప్పిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. దీంతో రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. మే 31న లేదా ఆ తర్వాత పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది.

మే 31 లోగా రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2000 నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు పడతాయి.అర్హులైన రైతులకు మాత్రమే ప్రతీ ఏటా పీఎం కిసాన్ పథకం ద్వారా మూడు సార్లు రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే ఈసారి ఇకేవైసీ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. ఇకేవైసీ చేయని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం లేదు.

ఈ కింది జాబితాలో ఉన్నవారెవరికీ పీఎం కిసాన్ పథకం వర్తించదు.

ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారికి ఈ పథకం వర్థించదు..

మాజీ లేదా ఇప్పుడు రాజకియాల్లో ఉన్న వారికి డబ్బులు రావు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, అధికారులు, స్థానిక సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు డబ్బులు రావు.

నెలవారీ పెన్షన్ రూ.10,000 కన్నా ఎక్కువ ఉన్న సూపర్‌యాన్యుయేట్, రిటైర్డ్ పెన్షనర్లకు ఈ పథకం వర్తించదు.

ప్రొఫెషనల్ బాడీస్‌లో రిజిస్టర్ అయి ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్..

ఈ స్కీమ్ అనేది చిన్న , సన్నకారు రైతుల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొని వచ్చారు..వీటి గురించి పూర్తీ వివరాలను తెలుసుకోవాలని అనుకుంటే పిఎమ్ కిసాన్ వెబ్‌సైట్ ను చూడవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version