సీఎం రిలీఫ్ ఫండ్‌కు రిలయన్స్ రూ.20 కోట్ల విరాళం!

-

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మున్నేరు వాగు పొంగి పొర్లడంతో వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆ ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు విరాళాలు అందజేస్తున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పలువురు విరాళాలు అందించేందుకు స్వచ్చంధంగా ముందుకువస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం అందజేసింది.ఈ మేరకు నీతా అంబానీ తరపున రిలయన్స్ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.ముంపు గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version