అనకాపల్లి జిల్లా చోడవరం సబ్‌జైలులో తాజాగా భారీ కలకలం చోటుచేసుకుంది. రిమాండ్‌లో ఉన్న ఇద్దరు ఖైదీలు అకస్మాత్తుగా పోలీసులపై సుత్తితో దాడి చేసి అక్కడినుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనతో జైలు వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్న సాధారణ తనిఖీలు జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు రిమాండ్ ఖైదీలు అకస్మాత్తుగా దాడి చేశారు.

డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులను లక్ష్యంగా చేసుకొని సుత్తితో తీవ్రంగా గాయపరిచారు. దాడి తర్వాత వారిని నేలకొరిగించి జైలు గోడ దాటి పరారయ్యారు ఖైదీలు. దాడిలో గాయపడిన సిబ్బందిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వైద్యుల ప్రకారం ప్రాణాపాయం లేని పరిస్థితి ఉన్నప్పటికీ తీవ్ర గాయాలున్నట్లు తెలుస్తోంది.
పోలీసులపై సుత్తితో దాడి చేసి పరారైన రిమాండ్ ఖైదీలు
అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఘటన
గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు pic.twitter.com/cXZ9DZUUw8
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025