బాలాపూర్ గణపతి నిమజ్జనానికి సిద్ధమవుతోంది. హుస్సేన్ సాగర్ లో బాలాపూర్ గణేష్ నిమజ్జనం చేస్తున్నారు. ఈ నిమజ్జనానికి ముందు పటిష్ట బందోబస్తు మధ్య శోభాయాత్ర ఉండనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల కల్లా బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరుగే ఛాన్స్ ఉంది.

ఇలాంటి తరుణంలోనే…. బాలాపూర్ లడ్డూ వేలం పాటపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత 31 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ వేలం పాట నిర్వహిస్తున్నారు. గత ఏడాది రూ.30,01,000లకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి.
ఈ సారి పోటాపోటీగా బాలాపూర్ లడ్డూ వేలంపాట కొనసాగనుంది. లడ్డూ వేలంపాటలో ఏడు మంది పాల్గొంటున్నారు. చంపాపేట్ కు చెందిన మర్రి కిరణ్ రెడ్డి, జిట్టా పద్మ సురేందర్ రెడ్డి, ఎల్బీ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి, కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, కొత్తగూడెంకు చెందిన సామ రామ్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన పీఎస్కే గ్రూప్స్ చాలా ఏళ్ల నుంచే లడ్డూ వేలంపాటలో పాల్గొన్నారు. దాదాపు పదేళ్ల నుంచి లడ్డూని కొలన్ ఫ్యామిలీ సొంతం చేసుకుంటోంది.