మీకు ఏదైనా కొత్త ఫోన్ కొనాలనిపించినా.. లేదా పాత ఫోన్(Old mobile) పాడైపోయినా కొత్త మొబైల్ కొనుక్కుంటారు. మరి, పాత మొబైల్‌ను రీప్లేస్ చేసే ఆప్షన్ ఉంటుంది. కానీ, పాత స్మార్ట్‌ఫోన్ ను అమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ విక్రయిస్తే.. ముందుగా రీసెట్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే చిక్కులు తప్పవు. రీసెట్ చేయకుండా మొబైల్ అమ్మారంటే మీ పర్సనల్ డేటాను వారి చేతుల్లో పెట్టినట్టే. ఛాట్స్, ఫోటోలు, సెల్ఫీలు, డాక్యుమెంట్ ఫైల్స్, ఇలా ఆ స్మార్ట్‌ఫోన్ లో ఉన్న వివరాలు, ఫైల్స్ అన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతాయి.ఒకవేళ అందులో ముఖ్యమైన ఫైల్స్, ఫోటోస్ లాంటివి ఉంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినా, వాటిని దుర్వినియోగం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ ఫైల్స్ అన్నీ బ్యాకప్ పెట్టుకొని స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేసుకోవాలి. అప్పుడే నిర్భయంగా మీ ఫోన్ అమ్మవచ్చు.