అంకెలతో గారడి..లెక్కలతో బురిడి..! భరతమాత ముద్దుబిడ్డ సీవీ రామన్‌..!

-

లెక్కలంటే టక్కున గుర్తెచ్చే పేరు సీవీ రామన్..ఎంతటి క్లిష్టమైన సూత్రమైన అలా అవలీలగా చేయగలుగుతాడు. భారత దేశం గర్వించదగ్గ మహనీయుడు సర్‌ సీవీ రామన్‌. స్వాంతంత్ర్యపు రోజులను తలుచుకునే ఈ టైమ్‌లో మరీ ఈ ముద్దుబిడ్డను ఎలా మరిచిపోతాం..! సీవీ రామన్‌ గురించి కొన్ని విషయాలు మీ కోసం..!

తమిళనాడులోని ఈరోడ్ నగరంలో 1887లో జన్మించాడు రామానుజన్. తండ్రి ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. ఆయన చాలీచాలని జీతంతోనే ఇళ్లు గడవాలి. పదో ఏటి నుంచే రామానుజన్‌లోని ప్రత్యేకతని ఇరుగు పొరుగు వాళ్లు గుర్తించారు. పెద్ద పెద్ద లెక్కలని కూడా కాగితం, పెన్సిలు వాడకుండానే మనసులోనే చెయ్యగల అసామాన్య నైపుణ్యం తనది. ఇంచు మించు ఆ వయసులోనే ప్రఖ్యాత ఆయిలర్ సూత్రాన్ని (exp(ix) = cos(x) + i sin(x) ) రామానుజన్ ఎవరి సహాయమూ లేకుండా కనుకున్నాడు.

చాలా మంది శాస్త్రవేత్తల జీవితాల్లో చిన్నతనంలో వారి మీద బలమైన ముద్ర వేసిన ఏదో సంఘటన జరగడము, దాంతో వారి జీవితం ఓ మలుపు తిరగడం చూస్తూ ఉంటాం. రామన్‌కి పదహారేళ్ల వయసులో గణితవేత్త లజాంద్రె (Legendre) ’సంఖ్యా శాస్త్రం’ మీద రాసిన పుస్తకాన్ని తమ కాలేజి ప్రిన్సిపలు చదవమని తెచ్చి ఇచ్చాడట… ఆ 900 పేజీల పుస్తకాన్ని ఆరు రోజుల్లో చదివాడట.

రామానుజన్ జీవితంలో అలాంటి సంఘటన 1903లో జరిగింది. జార్జ్ కార్ అనే వ్యక్తి రాసిన ఓ అవిశేషమైన గణిత పుస్తకం (A Synopsis of Elementary Results in Pure and Applied Mathematics) రామానుజన్‌కి ఆధునిక గణితానికి మొట్టమొదటి పరిచయ గ్రంథం అయ్యింది. అంత వరకు బడి చదువుల్లో తిప్పలు పడుతూ, కాలేజిలో చేరడానికి ప్రవేశ పరీక్షల్లో డింకీలు కొట్టిన రామానుజన్, ఈ పుస్తకాన్ని సునాయాసంగా అవపోసన పట్టేశాడు..అక్కడితో ఆగక పుస్తకంలో లేని కొత్త సుత్రాలను కూడా.. కనిపెట్టసాగాడు. జార్జ్ కార్ పుస్తకం రామానుజన్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిందో వర్ణిస్తూ రామానుజన్ సోదరి ఇలా అంది..” తనలోని మేధావిని తట్టి లేపింది ఈ పుస్తకం. ముందుగా అందులో ఇవ్వబడ్డ సిద్ధాంతాలని నిరూపించడానికి ఉపక్రమించాడు. ఈ ప్రయత్నంలో తనకి ఇతర పుస్తకాల ఆసరా లేదు కనుక ఒక్కొక్క సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఎంతో లోతైన పరిశోధన చేసేవాడు… నమక్కళ్ దేవత తనకి కలలో కనిపించి పరిష్కారాలు చెప్పేదనేవాడు.” అని అనేదట..

అంకెలపైన ఆరాటం..

తన అసమాన ప్రతిభాపాటవాలు రామానుజన్‌కి హై స్కూలు స్థాయిలో ప్రత్యేక పారితోషకాన్ని తెచ్చిపెట్టేవి.. బడిలో రోజూవారి క్లాసులు తనకి రుచించేవి కాదట.. తన ధ్యాస అంతా తన మనోవేదిక మీద నాట్యాలాడే అంకెల ఆటవెలదుల మీదే ఉండేది. దాంతో హైస్కూలు పరీక్షల్లో తప్పాడు. పారితోషకం రద్దయ్యింది. ఆ పరిణామానికి తట్టుకోలేక ఇంటి నుంచి రామానుజన్‌ పారిపోయాడు. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహం మీదట మళ్లీ తిరిగొచ్చి, బళ్లో చేరాడు. ఈ సారి సుస్తీ చేసి మళ్లీ పరీక్ష తప్పాడు.

కొందరు శ్రేయోభిలాషుల అండదండలతో రామానుజన్ మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్‌లో ఓ చిన్నపాటి గుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. తెలివితేటలతో బొత్తిగా పని లేని ఓ సాధారణమైన ఉద్యోగం అది. జీతం కూడా చాలా తక్కువ. ఐనిస్టయిన్‌కి స్విస్ పేటెంట్ ఆఫీసులో దొరికిన గుమాస్తా ఉద్యోగం లాంటిదే ఇది కూడా… జీతం తక్కువైనా ఈ ఉద్యోగం వల్ల తనకి అత్యంత ప్రియమైన గణితంలో మునిగిపోవడానికి బోలెడంత తీరిక దొరికేది. తన “కలల”ని సాకారం చేసుకోవడానికి వీలు దొరికేదని భావించేవాడట.

ఈ దశలోనే రామానుజన్ తను కొత్తగా కనుక్కొన్న కొన్ని గణిత ఫలితాలని ముగ్గురు ప్రఖ్యాత బ్రిటిష్ గణితవేత్తలకి పంపించాడు.. పెద్దగా చదువుకోని ఎవరో అనామక భారతీయ గుమాస్తా రాసిన ఆ ఉత్తరాన్ని, వారిలో ఇద్దరు గణితవేత్తలు చూసీచూడకుండానే చెత్త బుట్టలో వేశాశారు..మూడవ గణితవేత్త మాత్రం ఆ పొరబాటు చెయ్యలేదు. ఫిబ్రవరి 28, 1918లో రామానుజన్‌ని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరం అక్టోబర్‌లో ఈయనకు ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గా ఎన్నుకున్నారు. ఇది చాలా అరుదైన విషయం. ఈయన బీజ గణితంలో సాధించిన సమీకరణాల వల్ల యూలర్, జాకోబి వంటి గొప్ప శాస్త్రజ్ఞుల కోవలోకి చేరాడని కేంబ్రిడ్జిలో ఎంతో మంది చెప్పుకునేవారు.

క్షయ సోకడంతో రామానుజన్ ఇంగ్లాండు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఏప్రిల్ 26, 1920న చనిపోయేనాటి వరకు గణితంలో నిత్యం చిత్రవిచిత్రమైన అంశాలను ఆవిష్కరిస్తూ వుండేవాడు. ఈయనకు ఎనలేని దైవచింతన వుండేది. దైవం, శూన్యం, అనంతం ఇలాంటి అంశాల మీద ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారట… శ్రీనివాస రామానుజన్‌ అనగానే గుర్తుకొచ్చేది 32 ఏళ్లలోనే పేదరికాన్ని, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు గడించిన ఓ ‘సహజ గణితశాస్త్ర మేధావి’. ఈయన జీవితచరిత్ర యువ మేధావులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈ స్ఫూర్తి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిలో విజయాల్ని సాధించాలనే పట్టుదలను పెంచుతుంది. గణితాన్ని ప్రేమించేవారికి రామనుజన్‌ మొదటి గురువు అవుతారు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version